How to Make Mutton Curry: మటన్ కర్రీ తాయారు చేసే విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం

ఆదివారం లేదా పండుగ రోజుల్లో నాన్ వెజ్ ప్రియులకు మటన్ కర్రీ ఉంటే ఆ మజాయే వేరు. వేడి వేడి అన్నం, చపాతీ, బగారా రైస్ లేదా నాన్ (Naan) లోకి ఈ ఘాటైన మటన్ కర్రీ అద్భుతంగా ఉంటుంది. సులభమైన పద్ధతిలో, మంచి గ్రేవీతో రుచికరమైన మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

మసాలా బాగా కలపడానికి (నానబెట్టడానికి): ఈ కింద ఇచ్చిన సరుకులు మనం తీసుకునే మటన్ ఎన్ని కేజీలు ఉంటుందో దాని ప్రకారం మనం అవన్నీ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం కింద అరా కేజీ (500) మాత్రమే ఎలా వండాలి అని చెప్తున్నాము.

మటన్ – 500 గ్రాములు (శుభ్రంగా కడిగినది)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్

పసుపు – 1/2 టీస్పూన్

కారం – 1 టేబుల్ స్పూన్

పెరుగు – 2 టేబుల్ స్పూన్లు (మటన్ మృదువు గా ఉడకడానికి)

ఉప్పు – తగినంత

గ్రేవీ కోసం:

నూనె – 4-5 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయలు – 2 పెద్దవి (సన్నగా తరిగినవి)

టమాటాలు – 2 (మెత్తగా పేస్ట్ చేసినవి లేదా సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి – 3 లేదా 4 (పొడవుగా చీల్చినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్

కారం – 1 టేబుల్ స్పూన్ (మీకు తగినంత)

ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

  1. మసాలా బాగా కలపడానికి (నానబెట్టడం):
    ముందుగా ఒక గిన్నెలో శుభ్రం చేసిన మటన్ ముక్కలను తీసుకోవాలి. అందులో పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మరియు పెరుగు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. దీన్ని కనీసం అరగంట నుండి గంట పాటు పక్కన మూతపెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకు మసాలా పట్టి, లోపల జ్యూసీగా ఉడుకుతాయి.

గరం మసాలా పొడి – 1 టీస్పూన్

మటన్ మసాలా (ఐచ్ఛికం) – 1 టీస్పూన్

హోల్ గరం మసాలా (లవంగాలు – 4, యాలకులు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క, బిర్యానీ ఆకు – 1)

కొత్తిమీర, పుదీనా ముక్కలుగా కోసినది – కొద్దిగా

  1. మసాలా దినుసులు వేయించడం:
    స్టవ్ వెలిగించి, ప్రెషర్ కుక్కర్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.
  2. ఉల్లి, టమాటా వేయించడం:
    అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు (Golden brown) వచ్చే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసి, నూనె పైకి తేలే వరకు మీడియం మంట మీద ఉడికించాలి.
  3. మటన్ ఉడికించడం:
    మసాలాలు వేగిన తర్వాత, అందులో మసాలా కలిపి పెట్టిన ఉంచిన మటన్ ముక్కలను వేయాలి. మటన్‌లో ఉన్న నీరంతా పోయి నూనె పైకి తేలే వరకు సుమారు 8-10 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ బాగా వేయించాలి. ఇలా నూనెలో వేయించడం వల్లే కూరకు అసలైన రుచి వస్తుంది.
  4. నీళ్లు పోసి విజిల్స్ రప్పించడం:
    మటన్ బాగా వేగిన తర్వాత ధనియాల పొడి, అవసరమైతే మరికాస్త ఉప్పు, కారం వేసి కలపాలి. గ్రేవీకి సరిపడా సుమారు ఒకటిన్నర నుండి రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంట మీద 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. (లేత మటన్ అయితే 4 విజిల్స్ సరిపోతాయి).
  5. ముగింపు:
    ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మటన్ ఉడికిందో లేదో సరిచూసుకోవాలి. గ్రేవీ మరీ పల్చగా ఉంటే మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా చల్లి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే మటన్ కర్రీ రెడీగా ఉంటుంది తినడానికి ఇప్పుడు మీ ముందు.

Cricket Pitch Measurements: క్రికెట్ ఆట బాట్, బంతి మరియు పిక్స్ కొలతలు

One thought on “How to Make Mutton Curry: మటన్ కర్రీ తాయారు చేసే విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *