విజయవాడ కృష్ణలంక లో సంచలనంగా మరీనా గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండ్ సీఐ నాగరాజుని సిట్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణ అదృశ్యం వెనుక ఉన్న పరిస్థితులు, ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించేందుకు ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీస్ గెస్ట్ హౌస్‌కు తరలించారు. ఈ సమాచారం బయటకు రావడంతో నాగరాజు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొనగా, మద్దతుదారులు గుమికూడారు. నిరసనలను అదుపు చేసిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య నాగరాజును తీసుకెళ్లారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అరెస్ట్ చేసిన యువకుడు సాయి కృష్ణ ని పోలీస్ స్టేషన్ లో తీవ్రస్థాయిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి టార్చెర్ చేసారు అనే ఆరోపణలు అనుమానాలు వ్యకతం అయ్యాయి, ఆ తరువాత అతను కనిపించకుండా అదృశ్యం అవ్వడం చాల అనుమానాలకు దారితీసింది. ఈ కేసు ని రాష్త్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసుల కథనం, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సాయికృష్ణ అనే యువకుడిని ఓ కేసు విషయమై విచారించేందుకు కృష్ణ లంక పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే అప్పటి సీఐ నాగరాజు పర్యవేక్షణలో సాయికృష్ణపై కస్టడీ టార్చర్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల దెబ్బలు తట్టుకోలేక సాయికృష్ణ లాకప్‌లోనే మరణించాడని, ఆ నిజాన్ని దాచడానికే అతడి మృతదేహాన్ని మాయం చేసి, అదృశ్యమైనట్లుగా కలరింగ్ ఇచ్చారని బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఈ ఘటన స్థానికంగా శాంతిభద్రతల సమస్యగా మారడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.
కృష్ణా లంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలు, సదరు అధికారి కాల్ డేటా రికార్డులను సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో సీఐ నాగరాజుతో పాటు సహకరించిన ఇతర కింది స్థాయి సిబ్బంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.