Banana Stem Chaat Making Video: అరటి మువ్వ తో చేసే చాట్ ఎప్పుడైనా తిన్నారా… ఎలా తయారు చేస్తారు

అరటి చెట్టు దీని గురించి తెలియని వారు ఉండరు. మనం పూజలకు దేవుడుకి ప్రసాదం నైవేద్యం కింద అరటి పండు పెడతాం. అరటి కాయలు చాల రకాలు ఉన్నాయ్. వాటిలో మనం కొన్ని పండుగా తింటాం కొన్ని కాయలని వంటలో కూర చేసుకోడానికి కూడా ఉపయోగిస్తాం. అరటి పండు ఆరోగ్యానికి చాల మంచిది. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అరటి గెల చెట్టు ఉంచి గెల కొయ్యగానే అరటి చెట్టుని నరికివేస్తాం.

అయితే ఇప్పుడు మనాకి తెలియని విషయం ఏంటి అంటే అరటి చెట్టు మువ్వా తో కూడా చాల రకాల తినే పదార్ధాలు చేస్తారు. అరటి మువ్వ తో పోషకాలు మరియు రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు.

అరటి మువ్వతో చేసే ముఖ్యమైన వంటకాలు

అరటి పువ్వు పచ్చడి: అరటి పువ్వులోని రేకులను శుభ్రం చేసి, వేయించి, పచ్చిమిర్చి, చింతపండు, మరియు పోపుతో కలిపి రుచికరమైన పచ్చడి తయారు చేస్తారు.
అరటి పువ్వు కూర: పువ్వును చిన్న ముక్కలుగా కోసి ఉడకబెట్టి, శనగపప్పు, కొబ్బరి తురుము లేదా మసాలా దినుసులతో కలిపి వేపుడు కూరగా వండుకుంటారు.
అరటి పువ్వు పకోడీ / వడలు: పువ్వు ముక్కలను శనగపిండి, ఉల్లిపాయలు, మసాలాలతో కలిపి పకోడీలు లేదా వడలుగా వేయించుకుంటారు.
అరటి పువ్వు పులుసు: చింతపండు పులుసు, బెల్లం, మరియు మసాలాలు చేర్చి సాంప్రదాయ పులుసు తయారు చేస్తారు.

అరటి మువ్వతో చాట్ ఎలా తాయారు చేస్తారు

అరటి మువ్వని శుభ్రంగ కడిగి ముక్కలు ముక్కలు చేసి వాటితో చాట్ మసాలా ఎలా తాయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఐపీడు మనం జీవిస్తున్న జీవం విధానం లో స్ట్రీట్ ఫుడ్ అనేది చాల మంది ఇష్టపడతారు. మిరపకాయ్ బజ్జిలు బాటని చాట్, చల్ల పూనుకులు, అరటికాయ బజ్జిలు ఇలా రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ మనం చూస్తూ ఉంటాం. అరటి మువ్వతో కుడా చాట్ మాసాల చేస్తారు. అరటి మువ్వను బాగా చిన్న ముక్కలుగా చేసి వాటిని బాగా శుభ్రం చేసి ఉల్లిపాయలు కూడా బాగా చిన్నగా కట్ చేసి కొత్తిమీర మరియు క్యరెట్ చిన్నముక్కలుగా చేసి వాటికి మసాలా కలిపి బాగా మిక్స్ చెయ్యాలి మిక్చర్ల . దాన్ని టేస్ట్ చేస్తే చాల బాగుంటుంది.

పై వీడియో లో అరటి మువ్వా చాట్ ఎలా తాయారు చేస్తారో చుడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *