మనం అందరం ఇష్టంగా ఆడే క్రికెట్ ఆట అంటే చాల ఇష్టం అందరికి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన భారతదేశంలో క్రికెట్ ఆటకు చాల ఎక్కువ మంది ఇష్ట పడతారు. మరి ఆ క్రికెట్ ఆట కి కూడా కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

అంతర్జాతీయ క్రికెట్ ఆటలో అందరికీ అర్థమయ్యేలా, రూల్స్ అన్ని సమానంగా ఉండేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) కొన్ని కచ్చితమైన నిబంధనలను తయారు చేసారు. ఆటలో ప్రధానమైన పిచ్, బ్యాట్, మరియు బంతి కొలతలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఎలా ఉండాలో ఇక్కడ కింద అన్ని వివరంగా తెలుసుకుందాం.
- క్రికెట్ పిచ్ కొలతలు:
క్రికెట్ మైదానం మధ్యలో ఉండే దీర్ఘచతురస్రాకారాం లో ఉండే ప్రాంతమే పిచ్. ఆటలో అత్యంత కీలకమైన భాగం ఇదే.
పొడవు: రెండు వైపులా ఉండే స్టంప్స్ మధ్య దూరం కచ్చితంగా 22 గజాలు (20.12 మీటర్లు) ఉండాలి.
వెడల్పు: పిచ్ వెడల్పు 10 అడుగులు (3.05 మీటర్లు) ఉంటుంది.
పాపింగ్ క్రీజ్ (బ్యాటింగ్ క్రీజ్): ఇది స్టంప్స్ లైన్ నుండి 4 అడుగుల (1.22 మీటర్లు) దూరంలో గీస్తారు. బౌలర్ బంతి విసిరే సమయంలో కాలు ఈ గీతను దాటకూడదు (దాటితే నో-బాల్ అవుతుంది).
అలాగే బ్యాటర్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే ఈ క్రీజ్ లోపల ఉండాలి.
బౌలింగ్ క్రీజ్: స్టంప్స్ పాతిపెట్టే లైన్‌ను బౌలింగ్ క్రీజ్ అంటారు. దీని పొడవు 8 అడుగుల 8 అంగుళాలు (2.64 మీటర్లు) ఉంటుంది.
రిటర్న్ క్రీజ్: పిచ్‌కు ఇరు వైపులా గీసే నిలువు గీతలు ఇవి. బౌలర్ పరుగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఈ గీతను దాటి బయటకు వెళ్ళకూడదు. వైడ్ బాల్స్‌ను నిర్ణయించడానికి కూడా ఈ గీతలు ఉపయోగిస్తారు.
- క్రికెట్ బ్యాట్ కొలతలు
బ్యాట్ మరియు బంతి మధ్య సరైన సమతుల్యత ఉంచడానికి, బ్యాట్ సైజుపై MCC 2017లో కీలకమీనా రూల్స్ ని మరియు కొన్ని నియమాలని ప్రవేశపెట్టింది.
పొడవు: బ్యాట్ మొత్తం పొడవు హ్యాండిల్‌తో సహా గరిష్టంగా 38 అంగుళాలు (96.52 సెంటీమీటర్లు) మించకూడదు.
వెడల్పు: బ్యాట్ వెడల్పు గరిష్టంగా 4.25 అంగుళాలు (10.8 సెంటీమీటర్లు) ఉండాలి.
మందం (Depth): బ్యాట్ మధ్యభాగంలో మందం గరిష్టంగా 2.64 అంగుళాలు (6.7 సెంటీమీటర్లు) మాత్రమే ఉండాలి.
అంచులు (Edges): బ్యాట్ అంచుల మందం 1.56 అంగుళాలు (4 సెంటీమీటర్లు) మించి ఉండకూడదు.
- క్రికెట్ బంతి కొలతలు
బంతి తయారీలో నాణ్యమైన లెదర్ వాడుతారు. పురుషుల, మహిళల క్రికెట్‌కు బంతి బరువు, ఆకారం లో కొన్ని మెరుపులు ఉంటాయి. పురుషుల క్రికెట్: బంతి బరువు 155.9 గ్రాముల నుండి 163 గ్రాముల (5.5 – 5.75 ఔన్సులు) మధ్య ఉండాలి.
బంతి చుట్టుకొలత (Circumference) 22.4 సెం.మీ నుండి 22.9 సెం.మీ వరకు ఉండాలి.
మహిళల క్రికెట్: బంతి బరువు కాస్త తక్కువగా, 140 గ్రాముల నుండి 151 గ్రాముల మధ్య ఉంటుంది.
చుట్టుకొలత 21.0 సెం.మీ నుండి 22.5 సెం.మీ వరకు ఉండాలి.
ఈ కొలతలన్నీ క్రికెట్ ఆటను బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా ఉండేలా చూస్తారు. ఏ ఒక్కరికీ అదనపు ప్రయోజనం కలగకుండా ఈ కచ్చితమైన నియమాలు అందరికి కచ్చితంగా వర్తిస్తాయి.