- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు 1.621 శాతం మేర డీఏ (కరువు భత్యం) పెంచుతూ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు 1.621 శాతం మేర డీఏ పెంచుతూ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెంచుతున్నట్లు చెప్పారు. ఈ డీఏ పెంపు నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లకు లాభం చేకూరనుంది. ఈ పెంపు నిర్ణయంతో విద్యుత్ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఉన్న 17.651 నుంచి 19.272 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా సుమారు రూ.9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యుత్ రంగ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాబోయే పదేళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను, మౌలిక సదుపాయాల కల్పనను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో ఈదురు గాలులు, భారీ వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే స్పందించి పునరుద్ధరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ వాడకం రోజురోజుకి పెరుగుతుంది. ఈ ఏడాది గరిష్టంగా 18,548 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. అయితే, రాబోయే 2035-36 నాటికి ఈ పీక్ డిమాండ్ ఏకంగా 34,137 మెగావాట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాం. అంటే ఇది దాదాపు రెట్టింపు కానుంది. భవిష్యత్తు లో రాబోయే అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు ఇప్పుడే సన్నద్ధం కావాలి అని బట్టి విక్రమార్క అన్నారు.