Virat Kohli vs MS Dhoni: విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని ఆస్తులు మరియు సంపాదన…. ఎవరికి ఎక్కువ

  • Mahendra Singh Dhoni vs Virat Kohli Net Worth: క్రికెట్ మైదానంలో కెప్టెన్సీ మరియు ఆట ముగించడం లో ధోని స్టైల్ చాల ప్రత్యేకంగా ఉంటుంది. కానీ సంపాదించడం లో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత భారత్ క్రికెట్‌లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న దిగ్గజాలు ఎంఎస్ ధోనీ మరియు విరాట్ కోహ్లీ. ఇటు కెప్టెన్ కూల్ గా ధోనీ దేశానికి ఎన్నో ఐసీసీ ట్రోఫీలు అందిస్తే, అటు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన రికార్డుల వేటతో ప్రపంచాన్నే శాసించాడు. కేవలం ఆటలోనే కాదు, బ్రాండ్ వాల్యూ, సంపాదనలోనూ వీరిద్దరూ ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పెరిగిన రైవల్రీ వీరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్‌ను ఎప్పుడూ లైవ్‌లో ఉంచుతుంది.

MS Dhoni vs Virat Kohli

మహేంద్ర సింగ్ ధోనీ ఆస్థి ఎంత?
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేసి నా తలా ఎంఎస్ ధోనీ బ్రాండ్ వాల్యూ కొంచెం కూడా తగ్గలేదు. 2026 లేటెస్ట్ మీడియా కథనాల ప్రకారం ధోనీ మొత్తం ఆస్తి విలువ దాదాపు 1060 కోట్ల రూపాయలు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకపోయినా, ధోనీ ఏడాదికి కేవలం ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్ ద్వారా 50 నుంచి 70 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కాంట్రాక్ట్, భారీ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్లు, స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు, రేసింగ్ టీమ్స్, కోళ్ల ఫారమ్ వంటి విభిన్న వ్యాపారాలు ధోనీకి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.

విరాట్ కోహ్లీ ఆస్తులు ఎంత…
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే, 2008లో అరంగేట్రం చేసినప్పటి నుంచి అతను సాధించిన విజయాలు అపారం. మైదానంలో పరుగుల వరద పారించిన కోహ్లీ, సంపాదనలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్తులు దాదాపు 1,100 కోట్ల రూపాయలుగా అంచనా. బీసీసీఐ (BCCI) ఏ+ గ్రేడ్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు, ఆర్సీబీ (RCB) ఐపీఎల్ శాలరీ మాత్రమే కాకుండా, కోహ్లీకి ఉన్న అద్భుతమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ అతన్ని బ్రాండ్ల ఫేవరెట్‌గా మార్చేసింది. వన్ఎయిట్ (18) బ్రాండ్, రెస్టారెంట్లు, ఫిట్‌నెస్ సెంటర్లు, ఇన్స్టాగ్రామ్ పెయిడ్ పోస్టుల ద్వారా కోహ్లీ భారీగా ఆర్జిస్తున్నాడు.

ఎంఎస్ ధోని మరియు విరాట్ కోహ్లీ ఇద్దరి ఆటగాళ్ల ఆస్తులు పోల్చి చూస్తే కోహ్లీ సంపాదన మరియు ఆస్తులు ధోని ఆస్తులు కంటే 40 నుంచి 50 కోట్ల ఎక్కువగా ఉండవచ్చు అని అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *