సోమవారం ఉదయం వేలాది మంది X వినియోగదారులు ట్విట్టర్ అకౌంట్ ప్లాట్‌ఫారమ్‌లో సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదించారు. X సేవలకు అంతరాయం కలిగిన సమయాలలో ఎప్పటికప్పుడు Downdetector ద్వారా పరీక్షించినప్పుడు సోమవారం ఉదయం 10 గంటలకు కొద్దిసేపటి ముందు 15000 మందికి పైగా వినియోగదారులు సమస్యలు ఎదురుకుంటున్నట్టు తెలియజేసారు. ఈ x ట్విట్టర్ అకౌంట్ డౌన్ సమస్య 9:30 గంటల సమయంలో ఎక్కువగా ఉన్నటు గుర్తించారు.

Downdetector సమాచారం ప్రకారం, న్యూయార్క్ నగరం, బోస్టన్ మరియు వాషింగ్టన్ D.C.లతో సహా తూర్పు తీర ప్రాంతంలోనే ఈ అంతరాయం ఎక్కువగా నమోదైంది. చికాగో, డల్లాస్ మరియు అట్లాంటా నగరాల్లోని వినియోగదారులు కూడా ప్లాట్‌ఫారమ్‌లో సమస్యలను నివేదించారు.
ఆదివారం (జూన్ 21) కూడా X ట్విట్టర్ సేవల్లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. Downdetector ప్రకారం, జూన్ 21న మధ్యాహ్న సమయంలో 2,600 మందికి పైగా వినియోగదారులు సమస్యలను ఎదురుకున్నారు అని నివేదించారు